అన్న యొద్దకు:
యోహాను 18:12:
అంతట సైనికులును సహస్రాధిపతియు, యూదుల బంట్రౌతులును యేసును పట్టుకొని ఆయనను బంధించి, మొదట అన్నయొద్దకు ఆయనను తీసికొనిపోయిరి.
కయప యొద్దకు:
మత్తయి 26:57:
యేసును పట్టుకొనినవారు ప్రధానయాజకుడైన కయప యొద్దకు ఆయనను తీసికొనిపోగా, అక్కడ శాస్త్రులును పెద్దలును కూడియుండిరి.
లూకా 3:2, అపొ 4:6 లో అన్నయు కయపయు ప్రధాన యాజకులుగా ఉన్నారని వ్రాసివుంది.
లూకా 3:2:
అన్నయు, కయపయు ప్రధాన యాజకులుగాను, ఉన్నకాలమున అరణ్యములోనున్న జెకర్యా కుమారుడైన యోహాను నొద్దకు దేవుని వాక్యము వచ్చెను.
అపో.కార్యములు 4:6:
ప్రధాన యాజకుడైన అన్నయు కయపయు, యోహానును అలెక్సంద్రును ప్రధానయాజకుని బంధువులందరు వారితో కూడ ఉండిరి.
న్యాయబద్దంగా చట్టబద్దంగా చూస్తే పదవిలోలేని ప్రధానయాజకుని యొద్దకు క్రీస్తును తీసుకురాకూడదు. అన్న, అంతకు ముందు కాలములో ప్రధానయాజకుడైయుండి ఆ పదవిని కోల్పోయిన పిమ్మట అది కయపకు లభించింది. అనగా యేసును బంధించిన ఆసంవత్సరంలో ప్రధానయాజకుడు కయపే తప్ప అన్నకాదు. అయిననూ, సైనికులు మొదట క్రీస్తును అన్నయొద్దకు తీసుకొనివచ్చుటకు కారణం అతనికి వారు ఇచ్చేగౌరవం కావచ్చు, లేదా వయసు మళ్లిన యూదుల అధికారి కనుక అతనిపెద్దరికానికి ఇచ్చే విలువగా వారికి తోచిన కారణంగా మొదటిగా వారు క్రీస్తును అన్నయొద్దకు తీసుకువెళ్ళియుండవచ్చు. ఏదిఏమైనప్పటకీ రోమీయులదృష్టిలో ఇది చట్టవిరుద్ధం. పరిపాలనలోవున్న కయప యొద్దకు తీసుకువచ్చుటకు బదులుగా వారు తమసొంత ఉద్దేశానుసారంగా ప్రవర్తించారు. తత్ఫలితంగా అన్న అకారణంగా క్రీస్తుపై లేనిపోని నిందలుమోపడం జరిగింది, సాక్షులను పిలిచి విచారించకుండానేవారు క్రీస్తును కొట్టారు, అలా లేఖనం ప్రకారం ఆయన అన్యాయపు తీర్పును పొందాడు (అన్యాయపు తీర్పునొందినవాడై అతడుకొనిపోబడెను అతడు నాజనులయతిక్రమమును బట్టిమొత్తబడెను గదా,యెషయా-53:8).
యెషయా 53:8:
అన్యాయపు తీర్పునొందినవాడై అతడు కొనిపోబడెను అతడు నా జనుల యతిక్రమమునుబట్టి మొత్తబడెను గదా. సజీవుల భూమిలోనుండి అతడు కొట్టివేయబడెను అయినను అతని తరమువారిలో ఈ సంగతి ఆలో చించినవారెవరు?
We love to hear from you , to spread the Christian news to all nations.