ఎక్కువగా ఈ ప్రశ్నను వేసే వారిలో అధికులు నాస్తికులే ఉంటారు. వీరి వాదన ఏదనగా “దేవునికి సమస్తము తెలుసు కదా, సమస్తము తెలిసిన దేవుడు మనుష్యులను పాపం చేయమని ప్రోత్సహించే అపవాదిని ఎందుకు స్పృష్టించాడు?”
దేవుని ప్రేమకు అప్పుడే దగ్గరవుతున్న విశ్వాసులకు కూడా అప్పుడప్పుడు ఈ ప్రశ్న కొంచెం సందేహకరముగానే ఉంటుంది. అయితే ఆత్మ నడిపింపుతో మనం సత్యాన్ని అన్వేషిద్ధాం.
మొదటిగా మనం తెలుసుకోవాలిసిన ముఖ్యమైన విషయం ఏదనగా “దేవుడు చేసిన సమస్తం అనగా అపవాదిని కూడా మంచిది గానే స్పృష్టించాడు”
ఆదికాండము 1:31:
దేవుడు తాను చేసినది యావత్తును చూచినప్పుడు అది చాలమంచిదిగ నుండెను.
మానవుడిని అయినా, ఒకప్పటి దేవదూత సాతానును అయినా మంచిదానిగానే స్పృష్టించాడు. దేవుడు ఎవరిని కూడా ఒక యంత్రం (ROBOT) లాగా స్పృజించలేదు , మనందరికి కావల్సినంత స్వేచ్చను ఇచ్చాడు. ఇదే స్వేచ్చను దేవుని ఆజ్ఞచే రూపించబడిన సాతానుకు కూడా ఇచ్చాడు.
కీర్తనలు 148:5:
యెహోవా ఆజ్ఞ ఇయ్యగా అవి పుట్టెను అవి యెహోవా నామమును స్తుతించును గాక
అయితే సాతాను దేవుడిచ్చిన స్వేచ్చను దేవునికే వ్యతిరేకముగా వాడుకున్నాడు.
యెషయా 14: 13, 14
నేను ఆకాశమున కెక్కిపోయెదను దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చింతును ఉత్తరదిక్కుననున్న సభాపర్వతముమీద కూర్చుందును మేఘమండలముమీది కెక్కుదును మహోన్నతునితో నన్ను సమానునిగా చేసికొందును అని నీవు మనస్సులో అనుకొంటివిగదా?
వీడి చెడు తలంపులే వాడి పతనానికి కారణమైనది దాని పర్యవసానమే ఈ లోకములోనికి పాపము ప్రవేశించింది.
ఇక రెండవదిగా సాతాను తిరుగుబాటు చేస్తాడని సమస్తము ఎరిగిన దేవునికి ముందే తెలుసి కూడా వాడిని ఎందుకు స్పృజించాడు అని తెలుసుకోవటానికి గల కారణాలు అన్వేషిద్దాం.
దేవుని స్వంతకుమారుడైన యేసయ్య నీ పాపముల కొరకు మరియు సర్వలోక పాపముల కొరకు కల్వరి శిలువ పై మరణించాలి, దేవుని ప్రేమను నీకు తెలియపరచాలి అంటే, అపవాది దేవునిపై తిరుగుబాటు చేయాలి, ఈ లోకములోనికి పాపము ప్రవేశించాలి.
యోహాను 15:13:
తన స్నేహితులకొరకు తన ప్రాణము పెట్టువానికంటె ఎక్కువైన ప్రేమగలవాడెవడును లేడు.
అపవాది దేవునికి వ్యతిరేకముగా తిరుగుబాటు చేస్తాడని, వాడి వలన మనం పాపమునకు లోనవుతామని, మరలా మనలను దేవుని యెదుట పరిశుద్ధులుగా నిలబెట్టుటకు మరియు మనల్ని రక్షించుటకు దేవుడైన యేసయ్యే ఈ భువి పైకి వచ్చి సర్వలోక పాపముల కొరకు కల్వరి శిలువ పై మరణించాలి అన్నది దేవుని ప్రణాళిక (God’s Plan)
ఎఫెసీయులకు 1:4-6:
ఎట్లనగా తన ప్రియునియందు తాను ఉచితముగా మనకనుగ్రహించిన తన కృపామహిమకుకీర్తి కలుగునట్లు,తన చిత్త ప్రకారమైన దయాసంకల్పముచొప్పున,యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై,మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని,మనము తన యెదుట పరిశుద్ధుల మును నిర్దోషులమునై యుండవలెనని జగత్తు పునాది వేయబడకమునుపే, ప్రేమచేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను.
దేవుని మహిమను ఆయన నీతిని మనం తెలుసుకోవాలి అంటే అపవాదిచే ఈ లోకములోనికి ప్రవేశించిన పాపం యొక్క అనర్ధాలు మనం తెలుసుకోవాలి.
ఇంక చివరిగా నా దేవుడు పరిశుద్ధుడు, గొప్పవాడును కనుక ఆయన ప్రణాళిక లోపం లేనిది , పరిపూర్ణమైనది అని మనం గ్రహించాలి.
We love to hear from you , to spread the Christian news to all nations.