BE FRUITFUL AND MULTIPLY

(GENISIS 1:28)

TELUGU CHRISTIAN VOICE

తన పెయింటింగ్స్ తో బైబిల్ సాక్షాన్ని చాటుతున్న మరియా క్లారా
|gospel Share:  

తన పెయింటింగ్స్ తో బైబిల్ సాక్షాన్ని చాటుతున్న మరియా క్లారా

హైదరాబాద్ .అక్టోబర్ 28 -తన పెయింటింగ్స్ తో బైబిల్ సాక్షాన్ని చాటుతున్నారు హైదరాబాద్ కి చెందిన మరియా క్లారా .తన కుంచెతో బైబిల్ చరిత్రను పెయింటింగ్స్ రూపంలో చూపుతూ శభాష్ అనిపించు కుంటున్నారు .ఒక చిత్రం గీయటం ఆశామాషీ వ్యవహారం కాదు .అందుకు ఎంతో ఖర్చవుతుంది .రోజులతరబడి సమయం కేటాయించాల్సి వస్తుంది .అందులోనూ బైబిల్ చిత్రాలను వేయటానికి అంతగా ఆసక్తి చూపరు.కాని బైబిల్ వాస్తవ గాధల తో కూడిన చిత్రాలను వేస్తూ దైవ సేవ చేస్తున్నారు క్లారా .ఒక చరిత్రను చదవటానికి కొంత సమయం పడుతుంది .కానీ , ఒక పెయిన్ టింగ్ లో క్షణాలలో తెలుసు కోవచ్చు .ఒక ఉద్యోగినిగా ఉంటూ చిత్రాలను వేయటం అభినంద నీయమ్. దేవుడు మన ప్రతి అవసరతలను తీరుస్తాడు అని చెప్పేందుకు గీసిన సప్తవర్ణ చిత్రం ..,విజయోత్సాహం తో దావీదు మహారాజు నాట్యం చేయడం ..,మోషే తో బండరాయిని కొట్టించి దేవుడు నీళ్ళు తెప్పించడం ..,భయపడకండి .., నేను ఉన్నానని దేవుడు చెప్పడం తదితర చిత్రాలు మనలను కట్టి పడేస్తాయి .తాను మంచి చిత్రకారిణి కావడం వెనుక దేవుని ఆశీర్వాదం ఉందని , తన భర్త టైమ్స్ ఆఫ్ ఇండియా లో సీనియర్ అసిస్టెంట్ ఎడిటర్ గా పని చేస్తున్న సుశీల్రావు ప్రోత్సాహం ఉందని చెప్పారు . అద్భుతమైన చిత్రాలను వేసే క్లారాను మనమంతా ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది .మరియా క్లారా కు సంబందించిన సమాచారాన్ని ఆమె సొంత వెబ్ సైట్ లో చూడవచ్చు .

వెబ్ చిరునామా http://www.mariaclara.tk

admin

administrator


Leave Your Comment